రామయ్య భక్తులకు సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్
BDK: జిల్లా కలెక్టర్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే శ్రీరామ నవమి వేడుకలకు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (CSR) కింద సహకరించాలని కలెక్టర్ అంకిత్ కోరారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు తాగునీరు, అన్నదానం, వసతి, పారిశుధ్యం వంటి సౌకర్యాలు కల్పించడంలో సంస్థలు భాగస్వాములు కావాలన్నారు.