సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పేద కుటుంబాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. జోన్-4 కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా 11 మందికి మంజూరైన చెక్కులను అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడిన లబ్ధిదారులు చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.