ప్రమాద భరితంగా విద్యార్థుల ప్రయాణం

ELR: కైకలూరు మండలం ఆటపాక గ్రామంలోని వివిధ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులు సమీప లంక గ్రామాల నుంచి పడవలోనే వెళ్ళవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి పాలకులు 2014లో సుమారు రూ. 50 కోట్లతో వంతెన నిర్మించేందుకు చేసిన ప్రయత్నం శిలాఫలకానికే పరిమితం అయ్యిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వంతెనను నిర్మించాలని వారు కోరారు.