బాపులపాడలో పర్యటించిన మాజీ ఉప రాష్ట్రపతి

కృష్ణా: భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో పర్యటించారు. గురువారం జాతీయ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ ఫామ్ హౌస్‌ను సందర్శించి పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రజలతో కలిసి విందులో పాల్గొన్నారు. అనంతరం పలువురి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. పుట్ట గుంట సతీష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.