మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు
SS: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ప్రాణాపాయం పొంచి ఉందని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులు లేదా యజమానులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.