'ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్'
BHPL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజాదివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లా వ్యాప్తంగా 10 ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను శ్రద్ధగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్ లక్ష్యమని తెలిపారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.