'అరెస్టు చేస్తారని భయపడి పారిపోలేదు'
VZM: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. జగన్ పాలనలో తనను కూడా అరెస్టు చేస్తారని భయపడి పారిపోలేదని అన్నారు.