నందిగామలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

NTR : నందిగామలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. నందిగామ మరిడి మహాలక్ష్మి అమ్మవారు, వాసవి మాత అమ్మవారి దేవాలయాల్లో మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. వాసవి మాతను వరలక్ష్మి దేవిగా అలంకరించారు . శివాలయంలో సుఖశామలాంబ అమ్మవారికి కుంకుమార్చన చేశారు.