నరసింహ కొండపై వీడియోలు.. దేవాదాయ శాఖ సీరియస్
నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నరసింహ కొండపై వెలసిన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇటీవల ఓ జంట తీసిన వీడియోపై దేవాదాయ శాఖ ఈవో గోపి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి వీడియోలు తీయడం చట్టరీత్యా నేరమన్నారు. మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయినప్పటికీ వైరల్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు.