VIDEO: భక్తిశ్రద్ధలతో శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం
SKLM: చైత్ర శుద్ధ బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు జరిగాయి. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను పల్లకిలో అలంకరించి గ్రామోత్సవాన్ని ఆలయ కమీటి సభ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.