VIDEO: చింతలపల్లిలో గ్రామసభలో పాల్గొన్న సీపీ
HNK: ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రామసభలో సీపీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొని, రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. బైక్ ఉన్నవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు.