లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
VZM: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొబ్బిలి నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరికి గాయాలవ్వగా, మెరుగైన చికిత్స కోసం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.