‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ కర్ణాటకలో రిలీజ్
హీరో తిరువీర్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 14 నుంచి కర్ణాటకలో కూడా ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా, ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.