మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం

KDP: కార్పొరేషన్ సహా ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, ఎర్రగుంట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో 284 జారీ చేసింది. కడపకు కలెక్టర్, ప్రొద్దుటూరుకు జాయింట్ కలెక్టర్, మిగతా ఐదు పట్టణాలకు ఆర్డీవోలు స్పెషల్ ఆఫీసర్లుగా ఆరు నెలల పాటు విధుల్లో ఉండనున్నారు.