అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. ఆశావాహులతో రాయ బేరాలు

ELR: నగర పాలక సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నగరపాలక సంస్థ దరఖాస్తులు స్వీకరించింది. స్థానిక కార్పొరేషన్ పారిశుద్ధ్య, పారిశుద్ధ్యయేతర విభాగాల్లో 78 ఖాళీలు ఉన్నాయి. సచివాలయాల్లో వీటి గురించి నోటీసు బోర్డులో పెట్టకుండా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దీంతో దరఖాస్తుల గడువు ముగియడంతో ఆశావాహులతో రాయ బేరాలు సాగిస్తున్నారని పారదర్శకత కరువైందని, ఆరోపణలు వస్తున్నాయి.