ములుగులో నేడు వాహనాల వేలం
ములుగు పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు గురువారం వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ సుధీర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి సమక్షంలో మధ్యాహ్నం 12:30 గంటలకు వేలం ప్రారంభమవుతుందని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని కోరారు. స్క్రాప్ వాహనాలను కట్ చేసిన తర్వాత మాత్రమే తరలించాలని సూచించారు.