VIDEO: భారీగా పెరిగిన మిర్చి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 21,825, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 21,000, అటు క్వింటా పత్తి ధర రూ. 8,200గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 1425, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 900, పత్తి రూ. 100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.