ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

NLG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో గౌడ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గౌడ్ సంఘం సభ్యులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ్ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.