'కిశోర వికాసం' పోస్టర్ల ఆవిష్కరణ'

CTR: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ 'కిశోర వికాసం సమ్మర్ క్యాంపెయిన్' పోస్టర్‌ను ICDS పీడీ వెంకటేశ్వరితో కలిసి ఆవిష్కరించారు. కిశోర బాలికల సాధికారత కొరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. విద్య, రుతుస్రావం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఉన్నత విద్య, బాల్య వివాహాల వలన కలిగే దుష్ప్రభావాలు తదితర వాటిపై అవగాహన కల్పిస్తారన్నారు.