కంబాల ఆధ్వర్యంలో జాతీయ పత్రిక దినోత్సవం వేడుక
E.G: గోకవరంలో బీజేపీ నేత, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిన్న జాతీయ పత్రికా దినోత్సవం ఘనంగా జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ విలేకరులు వృత్తిని కొనసాగిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా ఆర్థికంగా ఆదుకుంటానని భరోసా ఇస్తూ.. వారికి స్వీట్లు పంపిణీ చేశారు.