నేడు జగన్ మీడియా సమావేశం

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు వైసీపీ X ఖాతా ద్వారా వెల్లడించింది. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడతారని తెలిపింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం సహా అనేక అంశాలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.