ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం: కలెక్టర్

SRPT: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని కలెక్టరేట్‌లో ఎస్పీ నరసింహతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. వానకాలం ప్రారంభమైనందున ఇసుకకు ముందస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇసుక అక్రమ డంప్‌లను గుర్తించి వెంటనే సీజ్ చేయాలన్నారు.