'పకృతి వ్యవసాయంతో భూమికి, రైతుకి మేలు'
ASR: పకృతి వ్యవసాయం భూమికి, రైతుకి మేలు చేస్తుందని రైతు సాధికారత సంస్ధ సీఈవో టీ.బాబురావు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పకృతి వ్యవసాయంను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆదివారం గిరిజన వికాస సంస్థ ఆధ్వర్యంలో జీ.కే వీధి మండలంలోని దామనాపల్లి, దేవరపల్లి, పెదవలస పంచాయతీల్లో పకృతి వ్యవసాయ పద్ధతులలో పండిస్తున్న పంటలను ఆయన పరిశీలించారు.