ఎన్.ఎం.ఎం.ఎస్ పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు
AKP: నర్సీపట్నంలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు తమ సెంటర్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తురకబడి జడ్పీ హైస్కూల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతర మంచినీటి సరఫరా, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.