రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

SRPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన రాజు నాయక్ తండా సమీపంలో చోటు చేసుకుంది. జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన సతీష్ (26) సూర్యాపేట నుంచి స్వగ్రామానికి బైకుపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.