హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

RR: అబ్దుల్లాపూర్‌పేట్ మండల పరిధిలోని తొర్రూర్ గ్రామంలో హనుమంతుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హిందు సంఘాలు, ప్రజలు ఘటన స్థలానికి చేరుకొని ధర్నా చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.