వైన్ షాపు వద్ద ఘర్షణ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

PLD: నాదెండ్ల మండలం గణపవరంలో మంగళవారం మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఉత్తమ్ రౌత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఉత్తమ్ రౌత్, రాజీవ్ కాలనీకి చెందిన వ్యక్తులకు వైన్ షాపు వద్ద వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ఘర్షణకు దారితీయగా, కాలనీవాసులు ఉత్తమ్ రౌత్‌పై దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.