ఏకాగ్రతతో కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలి: ఛైర్మన్
JN: విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్ అన్నారు. జనగామ జిల్లాలోని శామీర్పేట పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు చైర్మన్ పరీక్ష సామాగ్రిని అందజేశారు. చదువు మన తలరాతను మారుస్తుందని, పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఛైర్మన్ అన్నారు.