గళ్లా మాధవి చేతుల మీదుగా కేర్ డెంటల్ క్లినిక్ ప్రారంభం

GNTR: గుంటూరు 31వ డివిజన్ ఏటి అగ్రహారంలోని విజేత స్కూల్ కాంపౌండ్‌లో కేర్ డెంటల్ క్లినిక్ ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ మరియు డెంటల్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి క్లినిక్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.