VIDEO: డ్రైన్‌ల పనులను పరిశీలించిన కమిషనర్
NLR: నగర పాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని డ్రైనేజీల నిర్వహణ తీరును శనివారం తనిఖీ చేశారు. స్థానిక సీఆర్పీ డొంక సర్వేపల్లి కాలువ, ఆర్. ఎస్. ఆర్ పాఠశాల వద్ద డ్రైన్ కాలువ, ఉయ్యాల కాలువ, మల్లాపు కాలువలను పరిశీలించి, మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.