బతికున్నంతవరకు NRCని అనుమతించను: మమతా
అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నక్సల్‌బరీలో నిర్వహించిన ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. NRC, SIR ప్రక్రియపై విమర్శలు గుప్పించారు. తన బతికున్నంతవరకు NRCని రాష్ట్రంలో అనుమతించనని చెప్పారు. అలాగే SIR కారణంగా 220 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.