ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

SRCL: వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర సంస్కృత విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరై, తమ గురువులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు గత స్మృతులను నెమరువేసుకుంటూ, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.