శివాజీ మహారాజ్ విగ్రహ పనులకు శ్రీకారం
NRML: భైంసా పట్టణ కేంద్రంలోని శివాజీ చౌక్‌లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంగళవారం అధికారికంగా పనులు ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, శివాజీ అభిమానులు పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి భావన యువతకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.