VIDEO: గుబ్బెడితండలో మిషన్ భగీరథ నీళ్ల వృధా

VIDEO: గుబ్బెడితండలో మిషన్ భగీరథ నీళ్ల వృధా

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలోని గుబ్బెడితండ 5వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీళ్లు వృథాగా పోతున్నాయి. రోజుల క్రితం తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ అదే చోట నీరు ప్రవహిస్తోంది. నీటి కొరతతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోమవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని శాశ్వతంగా సరిచేయాలని కోరుతున్నారు.