ప్రారంభం కాకముందే శిథిలావస్థ!
VKB: ప్రభుత్వాలు మారినా గ్రామాల ప్రజల రవాణా కష్టాలు మాత్రం తీరడం లేదు. ధారూర్ మండల పరిధి చింతకుంట, హరిదాసుపల్లి, మైలారం, కొత్తతండా గ్రామస్తుల దశాబ్దాల కల అయిన వంతెన నిర్మాణం నేటికి అటకెక్కి ఉండడం పాలకుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. పనులు నేటికి పూర్తి కాకపోవడం గమనార్హం.