ఆరు గ్యారంటీల ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే

SRPT: ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు Y.నరేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సిద్ధిసముద్రం IKP సెంటర్‌లో రైతులకు బోనస్ జమ అయిన సందర్భంగా CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు ₹500 బోనస్ ఇస్తూ.. హామీని అమలు చేశారన్నారు.