ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
WGL: గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.