కేరళ అప్పులు మూడు రెట్లు పెరిగాయి: మోదీ
కేరళ ప్రభుత్వ అసమర్థతతో గత రెండేళ్లలో అప్పులు మూడు రెట్లు పెరిగిపోయాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజలు పన్ను రూపంలో కట్టే డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావటం లేదన్నారు. NDA ప్రభుత్వం వస్తే ప్రజల డబ్బును అభివృద్ధికే వినియోగిస్తామని హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాలేదని.. ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.