కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

ప్రకాశం: ఒంగోలులోని త్రోవగుంట వద్ద విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కర్నాటి వెంకటరెడ్డి (79) శుక్రవారం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మృతి చెందాడు. ఆయన మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతని మృతి దేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.