గుషిణిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

గుషిణిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

VZM: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామంలో ఇవాళ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు జమ్ము అప్పలనాయుడు ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. పేద విద్యార్థుల ఆశలను నీరుగార్చొద్దని ఆయన హితవు పలికారు.