తగరపువలస ఘటనలో మరో చిన్నారి మృతి

తగరపువలస ఘటనలో మరో చిన్నారి మృతి

VSP: తగరపువలసలోని ఆదర్శనగర్‌లో పురుగుమందులు తాగిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇషిత(5) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల భార్యా భర్తల గొడవతో మనస్థాపం చెందిన వివాహిత మాధవి(25) ఇద్దరి కుమార్తెలతోపాటు పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. దీంతో మాధవితో పాటు చిన్న కుమార్తె శనివారం మృతి చెందింది.