ఓటు వజ్రాయుధం.. అమ్ముకోవద్దు: జిల్లా ఎస్పీ నరసింహ
SRPT: రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఓటర్లు కు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా ప్రజలకు సందేశమిచ్చారు. మీ ఓటు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం. దానిని ఆదర్శంగా, సజావుగా చేసుకోండి, ఓటు అమ్ముకోవద్దు అని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.