ప్రభుత్వ శాఖలు సమర్థంగా పనిచేయాలి: కలెక్టర్

ప్రభుత్వ శాఖలు సమర్థంగా పనిచేయాలి: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో సంక్షేమం సార్థకం కావాలంటే ప్రభుత్వ శాఖలన్నీ సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పట్టు పరిశ్రమ, డ్వామా, డీఆర్‌డీఏ, జిల్లా లీడ్ బ్యాంక్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల పథకాలు, లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై చర్చించారు.