అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత

ASF: జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం ఉదయం ఆసిఫాబాద్ మండలం ఎప్పల్ నావేగావ్ బస్ స్టాప్ వద్ద అక్రమంగా గుడుంబా రవాణా చేస్తున్న టేకం చిలుకయ్యను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 లీటర్ల గుడుంబా, ఒక బజాజ్ డిస్కవర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రజల హానికరమైన గుడుంబా వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ హెచ్చరించారు.