చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67 లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుందని పేర్కొన్నారు.