సైబర్ నేరాలపై అవగాహన

MDK: చేగుంట మండల కేంద్రంలో చేగుంట పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరలపై అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రజలకు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే యాప్స్‌కు స్పందించవద్దని, ఓటీపీలు షేర్ చేయవద్దని పేర్కొన్నారు. ఎస్సై బిక్య నాయక్, హెడ్ కానిస్టేబుళ్లు సత్తయ్య, రాములు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.