పొదిలిలో భూకంపం

పొదిలిలో భూకంపం

ప్రకాశం: పొదిలి పట్టణ పరిసర ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. సుమారు 3 గంటల సమయంలో 3 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంపై అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో కూడా పొదిలిలో పలుమార్లు భూమి కంపించిన సంఘటనలు ఉన్నాయి.