ఈనెల 14 నుంచి సముద్రంపై చేపల వేట నిషేధం

ఈనెల 14 నుంచి సముద్రంపై చేపల వేట నిషేధం

విశాఖలో ఐఎఫ్‌ఆర్ మిలాన్ కార్యక్రమం నేపథ్యంలో ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, వేట నిషేధం ఉంటుందని మత్స్యకార జేడీ లక్ష్మణరావు తెలిపారు. 30, 37వ వార్డులో కొత్త జాలరి పేట, పెయిందొర పేటలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అవగాహన కల్పించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సజావుగా సాగేందుకు మత్స్యకాలందరూ సహకరించాలని ఆయన కోరారు.