గ్రామంలో ఒక్కటే ఇల్లు.. వారికే రిజర్వేషన్
TG: వికారాబాద్ జిల్లా మంతన్ గౌడ్ గ్రామంలో 494 మంది ఓటర్లు ఉండగా.. 8 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ ST జనరల్‌కు కేటాయించగా 2 వార్డుల్లో ST జనరల్, ST మహిళకు రిజర్వేషన్ దక్కింది. గ్రామంలో ఎరుకలి బీమప్పకు చెందిన ఒకే ఒక ST కులానికి చెందిన కుటుంబం ఉంది. పోటీకి మరో ST వ్యక్తి ఆ గ్రామంలో లేకపోవడంతో ఒక సర్పంచ్, 2 వార్డు సభ్యులతో మొత్తం 3 పదవుల్లో ఆ కుటుంబం ఏకగ్రీవం కానుంది.