కర్పూరం వెలిగిస్తే జరిమానా, జైలు శిక్ష!
రైళ్లలో కర్పూరం వెలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది భక్తులు రైళ్లలో కర్పూరం వెలిగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారు స్పందించారు. 'రైలులో కర్పూరం వెలిగిస్తే అది అగ్ని ప్రమాదానికి దారితీయవచ్చు. రైల్వే చట్టాల ప్రకారం ఇలా చేస్తే.. రూ.1,000 జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రెండూ కలిపి విధించవచ్చు' అని తెలిపారు.